తెలంగాణ

గుడుంబా స్థావరాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: హైదరాబాద్‌లోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. నగరవ్యాప్తంగా సరఫరా చేస్తున్న గుడుంబా కేంద్రంగా పేరుమోసిన ధూల్‌పేటలో ఎక్సైజ్ అధికారుల ఆపరేషన్ ధూల్‌పేట విజయవంతమైంది. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా గుడుంబా రహిత జిల్లాగా హైదరాబాద్‌ను ప్రకటించే క్రమంలో ఎక్సైజ్ శాఖ నగరంలోని గుడుంబా స్థావరాలపై విరుచుకుపడింది. ధూల్‌పేట పేరు వింటేనే గుడుంబా కళ్లముందే ప్రత్యక్షమైనట్టు కనిపిస్తుంది. దశాబ్దాలుగా ఇదే వృత్తిగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరి అక్రమ వ్యాపారంతో లక్షలాది కుటుంబాలు బజారునపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న సమయంలోనూ ఇక్కడి ప్రాంతంలో మద్యం ఏరులై పారింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన గుడుంబా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు పొరుగు జిల్లాలకు కూడా తరలించేవారు. రోజుకు 2 లక్షల లీటర్ల గుడుంబా సరఫరా చేసేవారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గుడుంబాపై యుద్ధ్భేరి మోగించిన ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలోని ఎనిమిది జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించింది. ఆబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ధూల్‌పేటలో 24 గంటలు నిఘా పెట్టి గుడుంబా సరఫరా చేసేవారిపై కేసులు పెట్టారు. 150 రోజుల్లో ఆపరేషన్ ధూల్‌పేట పూర్తి చేసినట్టు డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. గుడుంబా తయారీ చేసే వారు ఉపాధి కోల్పోతామని అనుకుంటే వారికి ప్రభత్వపరంగా పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.