తెలంగాణ

ట్రాఫిక్ పోలీసుల దసరా ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: దసరా సీజన్ వచ్చిందంటే వివిధ వస్త్ర దుకాణాలు, ఎలక్ట్రానిక్స్, జెవెల్లర్స్ వంటి సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తారు. ఈ షాపింగ్ సైట్లు ఇప్పటికే పండగ ఆఫర్లతో ముందుకు వచ్చేశాయి. ఇలాంటి సమయంలో తాము మాత్రం ఎందుకు వెనకబడాలనో..లేదా రద్దీని దృష్టిలో పెట్టుకొని చలాన్లు సంఖ్య పెరుగుతుందనో తెలియదు కానీ..హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం వాహనచోదకులకు దసరా ఆఫర్ ప్రకటించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి తాము విధించే చలాన్లలో సగం అంటే 50శాతం కడితే సరిపోతుందంటూ అనే ఆఫర్‌ను ప్రకటించారు. అయితే ఇందుకు షరతులు వర్తిస్తాయని ఓ చిన్న నిబంధన కూడా పెట్టారు. వాహన చోదకులు ముందుగా అదాలత్‌కు హాజరై.. అక్కడే తమకు ట్రాఫిక్ పోలీసుల నుంచి అందిన చలానాలో సగం కడితే సరిపోతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నెల 5 నుంచి 7 వరకు గోషామహల్ స్టేడియంలో నిర్వహించే అదాలత్‌కు చలానాలు తీసుకొని వచ్చి.. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు కోరారు.