తెలంగాణ

రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు వీలుగా వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయం సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, కిసాన్, ఖేత్ కాంగ్రెస్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత నాలుగు పంట కాలాలు కరవు పరిస్థితులతో రైతులు తల్లడిల్లారని ఉత్తమ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వరదలతో ఉన్న పంటలు కూడా దెబ్బతిన్నాయని అన్నారు. ప్రభుత్వ తాత్కాలిక తొలి లెక్కల ప్రకారమే 4 లక్షల 45 వేల 792 ఎకరాలలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. నిజానికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని అన్నారు. కరవు, వరదలతో పంటలు దెబ్బతినడం, ఇంకా మూడో విడత పంట రుణ మాఫీ నిధులను బ్యాంకులకు జమ చేయకపోవడం వల్ల రైతులకు కొత్తగా రుణాలు లభించకపోవడం, పంట బీమా పథకం అమలు కాకపోవడం, కల్తీ విత్తనాలు అరికట్టకపోవడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులు ఎక్కువ కావడం వంటి అనేక సమస్యలకు గురవుతున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వరదల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించడం లేదని విమర్శించారు. కరవు, వరదల నష్టాలను అంచనా వేసి కేంద్ర బృందాన్ని పిలిపించి వాస్తవ పరిస్థితులను చూపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కరవు నిధులు పంపించినట్లు కేంద్రం చెబుతుంటే, ఒక్కపైసా రాలేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నదని ఆయన తెలిపారు. పైగా వర్షాలకు హర్షం వ్యక్తం చేస్తూ రెండళ్ళ వరకూ కరవు పరిస్థితులు ఉండవని మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన తెలిపారు. కాబట్టి ఈ పరిస్థితులన్నింటిపై చర్చించి రైతులను ఆదుకునేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు.