తెలంగాణ

కేబుల్ టీవీలో ‘మన టీవీ’ ప్రసారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని మన టీవీ కార్యక్రమాలను కేబుల్ ద్వారా కూడా ప్రసారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. మన టీవీ ఛానల్ ప్రసారాలను కేబుల్ ద్వారా ప్రసారం చేసేందుకు రాష్ట్ర ఎమ్మెస్వోలు అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ఉపయోగపడే కార్యక్రమం కనుక తాము ప్రసారం చేస్తామని ఎంఎస్‌ఓలు చెప్పారని అన్నారు. రాష్ట్రంలో 60 మంది ఎంఎస్‌ఓలు, 15వేల మంది లోకల్ ఎమ్మెస్వోల ద్వారా సుమారు 90 లక్షల కుటుంబాలకు కేబుల్ ప్రసారాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. కేబుల్ ప్రసారాలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఇఓ శైలేష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.