ఆంధ్రప్రదేశ్‌

222 ఇ పట్టణ ఆరోగ్య కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 3: నగరాలు, పట్టణాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్టవ్య్రాప్తంగా 222 ఇ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 21, విశాఖపట్నంలో 26 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన 10 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలోనూ, మీడియాతోనూ ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి సోకడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. విటమిన్-బి1 లోపం వల్ల కాళ్లవాపువ్యాధికి గురవుతున్నట్లు వైద్యులు గుర్తించారన్నారు. అలాగే వ్యాధిగ్రస్తులు కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెయ్యి మంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.