తెలంగాణ

జెఎన్‌టియు హెచ్ ప్రక్షాళన కీలక పదవుల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: జెఎన్‌టియు హైదరాబాద్‌ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. కీలక పదవుల్లో మార్పులు చేశారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్‌గా మంజూరు హుస్సేన్‌ను నియమించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా గుప్త స్థానంలో తార కళ్యాణిని నియమించారు. డియుఎఫ్‌ఆర్ డైరెక్టర్‌గా డాక్టర్ ఎం విశ్వనాధం స్థానంలో చెన్న కేశవరెడ్డిని నియమించారు. బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (బిక్స్) డైరెక్టర్‌గా రామమోహనరావు స్థానంలో లక్ష్మణ్‌రావును నియమించారు. డైరెక్టర్ ఆఫ్ ఇవాల్యూయేషన్ డాక్టర్ బి ఆంజనేయ ప్రసాద్‌ను సుల్తాన్ పూర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమించారు.
పాలిసెట్ పరీక్ష ప్యాటర్న్‌లో మార్పు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ పాలిసెట్ పరీక్ష ప్యాటర్న్‌లో మార్పు చేస్తున్నట్టు సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు కార్యదర్శి డి వెంకటేశ్వర్లు తెలిపారు. 2017లో నిర్వహించే పాలిసెట్‌ను కొత్త ప్యాటర్న్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. మ్యాథమెటిక్స్‌లో 50 మార్కులకు 50 ప్రశ్నలు, ఫిజిక్స్ పేపర్ 25 మార్కులకు 25 ప్రశ్నలు, కెమిస్ట్రీ 25 మార్కులకు 25 ప్రశ్నలు, సోషల్‌స్టడీస్ 10 మార్కులకు 10 ప్రశ్నలు, ఇంగ్లీషు 10 మార్కులకు 10 ప్రశ్నలు ఇస్తారు.