తెలంగాణ

పట్టణాల్లో ఎల్‌ఈడీ కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎల్‌ఈడి వీధి దీపాలు ఎర్పాటు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఎల్‌ఈడి లైట్ల ఏర్పాట్ల పురోగతిపై ఆయా సంస్థల ప్రతినిధులతో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థ యస్‌యస్‌ఎల్ యండి సౌరభ్ కుమార్ కూడా పాల్గొన్నారు. గత కొంత కాలంగా వివిధ పట్టణాల్లో చేపట్టిన ఎల్‌ఈడి లైట్ల పంపిణీపై మంత్రి సమావేశంలో చర్చించారు. మూడు నెలల్లో నాలుగున్నర లక్షల ఎల్‌ఈడి బల్బులు పంపిణీ చేసినట్టు సౌరభ్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియను మరింత వేగంగా అమలు చేయాలని కెటిఆర్ చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మొత్తం వీధి దీపాలను ఎల్‌ఈడి లైట్లతో మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సిడియంఏ దానకిశోర్‌ను ఆదేశించారు. ఈఈయస్ యల్ ప్రభుత్వ రంగ సంస్థతో ఈ మేరకు ఒప్పందం చేసుకోవాలని సూచించారు.
జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 4.5లక్షల వీధి దీపాలను ఎల్‌ఈడి లైట్లు బిగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో నగరంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు అమలు, ఫలితాల మీద నివేదికను కంపెనీ మంత్రికి అందజేసింది. పోలీసు డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేస్తున్న కెమెరాలు, వైఫై సౌకర్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎల్‌ఈడి లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ లైటింగ్ సాధ్యమైనంత వరకు స్మార్ట్‌గా ఉండాలని చెప్పారు. అర్ధరాత్రి ఆటోమెటిక్‌గా ఆగిపోవడం , డిమ్ కావడం వంటి సౌకర్యం ఉండాలని చెప్పారు.
ఈ ఒప్పందం ప్రకారం విద్యుత్ బిల్లులో కనీసం 50 శాతం తగ్గే విధంగా నిబంధన ఉండాలని తెలిపారు. సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ యంజి గోపాల్, జిహెచ్‌ఎంసి కమీషనర్ జనార్ధన్‌రెడ్డి, సిడియంఏ దాన కిశోర్, ఈఈయస్‌ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎల్‌ఈడి లైట్ల ఏర్పాట్ల పురోగతిపై ఆయా సంస్థల
ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తున్న మంత్రి కెటిఆర్