తెలంగాణ

విసిల నియామకాలపై తెలంగాణ మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఏడు విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్ల నియామకాలు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఏడు విశ్వవిద్యాలయాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వమే నియామాక ఉత్తర్వులను జారీ చేసింది. కాని రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకూ గవర్నరే చాన్సలర్‌గా కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇటీవల నియమితులైన విసిలను తిరిగి నియమించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. వారిని తిరిగి నియమించాలంటే ముందు పదవుల నుండి స్వచ్ఛందంగా వైదొలగాల్సి ఉంటుంది.
తిరిగి నియమించాలంటే సెర్చి కమిటీలను నియమించి వారి ద్వారానే సిఫార్సులను తెప్పించుకుని గవర్నర్ నియమించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ అది జరగాలంటే మరోమారు సెర్చి కమిటీలకు నోటిఫికేషన్ ఇవ్వాలి, సెర్చి కమిటీలకు నోటిఫికేషన్ ఇచ్చినపుడు బహిరంగంగా విసిల నియామకానికి సైతం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం కొన్ని రోజుల పాటు విశ్వవిద్యాలయాల్లో విసిలు లేని పరిస్థితి ఏర్పడి ఇన్‌చార్జిలను నియమించాల్సి ఉంటుంది.
ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది, సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణపై తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాత చూద్దాంలే అనే ధోరణి ప్రదర్శిస్తోంది. వాస్తవానికి ఈ సాంకేతిక ఇబ్బందులు ఎదురుకాకుండా సవరించుకునే వీలున్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డి మనోహరరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు గతంలో విసిల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లబోవని ప్రకటించింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి ఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఎం ఖాన్‌విల్‌కర్, జస్టిస్ డి వై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ విసిలకు తాత్కాలిక రిలీఫ్ ఇచ్చినా, ఛాన్సలర్‌గా గవర్నర్ మాత్రమే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ పిటీషన్‌లతో పాటు హైకోర్టులో మరికొన్ని పిటీషన్లు కూడా విచారణ దశలో ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారమైతే విసిల కొనసాగింపు కష్టమేనని అంటున్నారు. వారినే మళ్లీ విసిలుగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, ప్రస్తుతానికి సాంకేతిక ఇబ్బందులు తప్పవనేది వారి వాదనగా ఉంది.