తెలంగాణ

మూడు ప్రయోజనాలు సిద్ధిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: జిల్లాల పునర్ విభజన వల్ల మూడు ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి కె తారకరామారావు అన్నారు. ఒకటి ప్రజలకు పరిపాలనా సౌలభ్యం, రెండు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదుగుదల, మూడు ఆధిపత్యానికి చెక్ అని మంత్రి అభిప్రాయపడ్డారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ హైపవర్ కమిటీ చైర్మన్ కె కేశవరావును కలిసి మంత్రి కెటిఆర్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే వెసులుబాటు కలుగుతుందన్నారు. భవిష్యత్‌లో నియోజకవర్గాల పునర్ విభజన కూడా జరుగుతుందన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంట్‌లో సాధారణ మెజార్టీతో నియోజకవర్గాల పునర్ విభజన చేయవచ్చని మంత్రి అన్నారు. హైదరాబాద్‌ను జిల్లాలుగా విభజించకపోవడంపై మంత్రి స్పందిస్తూ, నగరంలో రెవిన్యూశాఖకు పెద్దగా పని లేకపోవడమే కారణం అన్నారు. త్వరలోనే జిహెచ్‌ఎంసిని ప్రక్షాళన చేస్తామన్నారు.
జిహెచ్‌ఎంసిని 24 నుంచి 30 సర్కిళ్లుగా విభజిస్తామన్నారు. ఇక్కడ పని చేసే ఉద్యోగులను రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేసేందుకు చట్టంలో మార్పులు తెస్తామన్నారు. హైదరాబాద్‌లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి రూ. 25 వేల కోట్లతో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల 14న టి-హబ్‌శాఖను టి బ్రిడ్ పేరుతో అమెరికాలో ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆగిపోలేదన్నారు. ఎంపి మల్లారెడ్డి కాలేజిని కూల్చడానికి జిహెచ్‌ఎంసి సిబ్బంది వెళ్లగా బిఆర్‌ఎస్ పథకం కింద డబ్బులు చెల్లించడంతో ఆగిపోయినట్టు వివరించారు. లక్ష అనుమానాల మధ్య ఆవిర్భవించిన తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, నరుూం ఎన్‌కౌంటర్‌తో అసాంఘిక శక్తులకు బలమైన సంకేతాలు వెళ్లాయన్నారు. కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్ చేయలేకపోయిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రం తన వల్లనే వచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. సిరిసిల్ల, వేములవాడను కలిపి రాజన్న జిల్లా ఏర్పాటు చేయాలని హైపవర్ కమిటీని కోరినట్టు మంత్రి కెటిఆర్ చెప్పారు.