రాష్ట్రీయం

దేశ రక్షణకు ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, అక్టోబర్ 5: ఇతర దేశాలతో సఖ్యతతో ఉండాలనేది భారతదేశ విధానమని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. బుధవారం శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలోని శ్రీరామనగరంలో జరిగిన విలేఖరుల సమావేశంలో చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ.. ఇతర దేశాలతో సఖ్యతతో ఉండాలని భారతదేశం కోరుకుటుందని అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు సైనికుల సంక్షేమానికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.
దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జీవా సంస్థలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ.. సైనికుల సంక్షేమానికి విరాళం ఇచ్చారని తెలిపారు. కులమతాలకు అతీతంగా దేశం కోసం పోరాడే సైనికులకు అండగా ఉంటామని చెప్పారు.
23 నుంచి నవంబర్ 6వరకు
తిరునక్షత్ర మహోత్సవం
తిరునక్షత్ర మహోత్సవం ఈనెల 23 నుంచి నవంబర్ 6వ తేదిన వరకు శ్రీరామనగరంలో జరుగుతుందని జీయర్‌స్వామి తెలిపారు. విశేష పూజలతోపాటు హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 6న సాయంత్రం నగరంలోని ఎల్‌బిస్టేడియంలో చిన్నజీయర్‌స్వామి 60వ జన్మదినం పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఠాధిపతులను సన్మానిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్, కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు.

శంషాబాద్‌లో బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న చిన జీయర్‌స్వామి