తెలంగాణ

ప్రతి శాఖలోనూ పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: ప్రతీ శాఖలో డిపిసి నిర్వహించి పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శాఖాధిపతులను ఆదేశించారు. సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా అధికారుల నియామకం జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం శాఖాధిపతులతో జరిగిన మధ్యాహ్నం సెషన్‌లో జిల్లాల పునర్విభజనలో అధికారులు, ఉద్యోగుల నియామకంపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. పని భారం ఎక్కువ ఉన్న శాఖల్లో అవసరమైన ఉద్యోగుల నియామకానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. పరిపాలనా విభాగాల విస్తరణ నేపథ్యంలో ఆయా విభాగాల ఇంచార్జీలకు అధికారాలు, విధుల బదలాయింపు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగులను వారి వృత్తి స్వభావం ప్రకారం బాధ్యతలను, ఏ ప్రాంతానికైనా బదిలీ చేసే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండేలా నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పొల్యూషన్ బోర్డు, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫీస్, జీవిత బీమా అధికారి, డిడి షుగర్‌కేన్, జైళ్లశాఖ అధికారి, డివిజన్ ఫైర్ ఆఫీసర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి తదితర అధికారులు ప్రతీ జిల్లాలోనూ ఉండాల్సిన అవసరం లేదని, అవసరమైన చోటనే సంబంధిత కార్యాలయాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కొన్ని చోట్ల ఒక్కో అధికారిని ఒక్కో పేరుతో పిలుస్తున్నారని, జిల్లా స్థాయి అధికారిని వారి కేడర్‌తో సంబంధం లేకుండా జిల్లా అధికారిగా హోదా కల్పించాలన్నారు. మండల రెవిన్యూ అధికారిని తహసిల్దార్ అని, డిప్యూటీ ఎమ్మార్వోను నాయబ్ తహసిల్దార్ అని, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ను గిర్దావర్ అని పిలవాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ పరిస్థితులను అవగతం చేసుకుని ఇక్కడి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆచరణీయమైన పద్ధతులను అనే్వషించాలని, మంచి పాలన అందించడం కోసం ప్రభుత్వానికి అధికారులు చేసే సూచనలు చాలా కీలకమైనవని ముఖ్యమంత్రి అన్నారు.
వివిధ రాష్ట్రాలో పాలనా విభాగాల పనితీరు, ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి వెళ్లే సీనియర్ ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు ఎస్‌కె జోషి, మధ్యప్రదేశ్‌కు సోమేశ్‌కుమార్, చత్తీస్‌గడ్‌కు మీనా, హర్యానాకు నవీన్ మిట్టల్, ఒరిస్సాకు బిపి ఆచార్య, తమిళనాడుకు అజయ్ మిశ్రా, బీహార్‌కు ఎస్‌పి సింగ్‌ను ముఖ్యమంత్రి ఎంపిక చేశారు.