రాష్ట్రీయం

‘గాంధీ భావాలపై చైతన్యం తేవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: దేశంలో పెరిగిపోతున్న ఉద్రిక్తత, ఆందోళనల నేపథ్యంలో సమాజంలో గాంధీ భావాలను పాదుగొల్పాల్సిన రోజులు వచ్చాయని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. గాంధీపథం సంస్థ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్లు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున గాంధీ భావాలను సమాజంలో చేరవేయాలని తద్వారా విలువలను నెలకోల్పేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. వారణాసి రాజ్‌ఘాట్ వద్ద ఉన్న గాంధీ విద్యాసంస్థాన్‌ను మరింత పటిష్టం చేయాలని వారు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుడు జయప్రకాష్ నారాయణ్, డాక్టర్ సంపూర్ణానంద, శంకరరావు దేవ్ , కె అరుణాచలం స్థాపించిన గాంధీ విద్యాసంస్థాన్‌ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఆనాడు వారు సూచించిన లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆదేశక అంశాలకు అనుగుణంగా సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపడితే అన్ని రాష్ట్రాల్లో యువతలో సానుకూల భావాలను పాదుగొల్పవచ్చని పేర్కొన్నారు.