తెలంగాణ

డ్రగ్స్ డొంక కదులుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: హైదరాబాద్ మియాపూర్‌లో బయట పడ్డ డ్రగ్స్ దందా మూలాలు నిందితులను విచారిస్తున్న కొద్దీ విస్తరిస్తూ పోతున్నాయి. ఈ కేసులో ఓ సైంటిస్ట్‌ను అరెస్టు చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతని కుటుంబ సభ్యులను విచారించినప్పుడు ఓ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి పాత్రను గుర్తించి అతణ్ణి నాందేడ్‌లో అదుపులోకి తీసుకున్నారు.
సైంటిస్టు అరెస్టు విషయం తెలియగానే, ముంబయికి చెందిన నబీద్ సహకారంతో నాందేడ్‌కు పారిపోయిన కమాండర్ రాజశేఖర్ రెడ్డిని ఎన్‌సిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ దందాపై రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. కాగా రాజశేఖర్‌రెడ్డి తాను పాల్పడ్డ నేరాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించాడు. కొనే్నళ్లుగా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు అంగీకరించాడు. బెంగుళూరుకు చెందిన వెంకటరెడ్డి, ముంబయికి చెందిన నబీద్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు చెప్పాడు. సుమారు 250 కిలోల డ్రగ్స్ కావాలని వెంకటరెడ్డి తనను అడిగినట్టు తెలిపాడు. హైదరాబాద్‌కు చెందిన రామ్మూర్తిని ఎంఫెటామైన్ తయారు చేయమని తాను కోరినట్టు వాంగ్మూలంలో వెల్లడించాడు. ఐడిఏ బొల్లారంలోని డ్రైడెంట్ ఫైన్‌కెంలో డ్రగ్స్ తయారు చేసినట్టు రాజశేఖర్‌రెడ్డి చెప్పాడు. హైదరాబాద్‌కు వెళ్లి డ్రగ్స్ తీసుకురావాలని వెంకటరామారావుకు తానే చెప్పినట్టు వెల్లడించాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ వింగ్‌లో కమాండర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డే ఈ కేసులో కీలకమని భావించిన అధికారులు ఖంగుతిన్నారు. సైంటిస్ట్‌తోపాటు రామ్మూర్తి, వెంకటరెడ్డి, నబీద్‌ల భాగస్వామ్యంతోనే డ్రగ్స్ దందా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సైంటిస్టు, అతని భార్య, రాజశేఖర్‌రెడ్డిలను పోలీసు కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని అధికారులు తెలిపారు.