తెలంగాణ

ఇంకా చల్లారని అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 6: జిల్లాల విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తున్నా..పలు ప్రాంతాల్లోని ప్రజల్లో నెలకొని ఉన్న అసంతృప్తి మాత్రం చల్లారలేదు. నిన్నటిదాకా సిరిసిల్ల జిల్లా కోసం తీవ్రంగా ఆందోళనలు కొనసాగగా, అదే బాటలో హుజురాబాద్ జిల్లా కోసం ఆ ప్రాంతం వాసులు ఉద్యమాన్ని ఆరంభించారు. ఇదివరకే హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ సిరిసిల్ల జిల్లా ప్రకటనతో ఆందోళనలను తీవ్రతరం చేశారు. సుమారు 50 రోజుల పాటు ఉద్యమం కొనసాగిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రజాభీష్టం మేరకు సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాంతాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ ప్రాంత వాసులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం టిఆర్‌ఎస్ నాయకులతోపాటు జెఏసి నాయకులు జిల్లాల కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీని, సిఎం కెసిఆర్‌ను కలిసి విన్నవించేందుకు సుమారు 50 వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అలాగే హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని, లేదా హుజురాబాద్ డివిజన్‌ను వరంగల్‌లో కలపాలని డిమాండ్ చేస్తూ కమలాపూర్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో హుజూరాబాద్-పరకాల రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. టిడిపి, కాంగ్రెస్, బిజెపి నాయకులు రోడ్డుపై బైఠాయించి ’కరీంనగర్ వద్దురా..వరంగల్ ముద్దురా’ అంటూ నినాదాలు చేశారు. మంథనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ మంథని మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గాండ్ల నాగరాజు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.