తెలంగాణ

బీసీ కమిషన్‌కు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కమిషన్ ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉన్నట్టుగానే బీసీ విద్యార్థుల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల విద్యా సంస్థ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు. కెజి టు పిజి విద్యలో భాగంగా అన్ని వర్గాలకు గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీసీలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు విడిగా నాలుగు ఆర్డినెన్స్‌లు జారీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మండల రెవిన్యూ అధికారిని ఇకనుంచి తహశీల్దారుగా వ్యవహరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థ పరిధిలోకి ఆరు గ్రామాలను తీసుకురావడానికి కూడా ఆమోదం తెలిపింది. జిహెచ్‌ఎంసి పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చవేయడానికి అనువుగా మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 23 పోలీస్ సబ్ డివిజన్లు, 28 కొత్త సర్కిళ్లు, 92 కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ మేరకు అన్ని స్థాయిలో అవసరమైన సిబ్బంది నియామకానికి మంత్రిమండలి అనుమతించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో నిర్మించే ఇళ్లకు హడ్కో రుణం, యాదగిరిగుట్ట, పెద్దశంకరం పేటలో ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను మినహాయింపు, హెటిరో సంస్థ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో నిర్మించే క్యాన్సర్ ఆస్పత్రి కోసం 15 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 321మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆర్టీసీలో ఉచిత సౌకర్యం, పట్టణ, స్థానిక సంస్థల ఉద్యోగులకు ఒకే సర్వీస్ నిబంధనలు తీసుకురావడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.