తెలంగాణ

చట్ట సవరణ తరువాతే జిల్లాలపై తుది ముసాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటనకు చట్టపరంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్డినెన్స్ తేవాలని మంత్రిమండలి నిర్ణయించింది.
ముసాయిదాలో ప్రకటించిన సంఖ్యకంటే ఎక్కువ జిల్లాల ఏర్పాటు అనివార్యమైన పరిస్థితుల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం-1974కు సవరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదించింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో కొత్త జిల్లాల సంఖ్య వినా మిగతా ప్రక్రియకు ఆమోదం లభించింది. చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ తర్వాతే తుది నోటిఫికేషన్ వెలువడుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మంత్రిమండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాలో 27 జిల్లాలు ప్రకటించగా, ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలనుంచి లక్ష వినతుల వరకూ అందాయన్నారు. ప్రజా వినతుల పరిశీలనకు ఎంపీ కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ సైతం ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిందన్నారు. దీంతో 27కంటే ఎక్కువ జిల్లాల ఏర్పాటుకు చట్ట సవరణకు అనివార్యమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్డినెన్స్ జారీ తరువాతే జిల్లాల తుది ముసాయిదా విడుదల అవుతుందన్నారు. ఈలోగా కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జెసిలు, ఎస్పీల నియామక ప్రక్రియ చేపట్టేందుకు రెవిన్యూ, పోలీస్ శాఖలను మంత్రిమండలి ఆదేశించిందని కడియం తెలిపారు. ఇదిలావుంటే, మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్న సాయంత్రానికే కొత్త జిల్లాల చట్టసవరణకు ఆర్డినెన్స్ జారీ కావడం గమనార్హం.