తెలంగాణ

జాతీయ పండుగలా కొత్త జిల్లాల వేడుకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: కొత్త జిల్లాల ఏర్పాటు వేడుకల నిర్వహణపై శుక్రవారం జరిగిన మంత్రిమండలిలో చర్చ జరిగింది. జాతీయ పండుగల మాదిరిగా కొత్త జిల్లా కేంద్రాల్లో పోలీసు కవాతు నిర్వహించి ఆ తర్వాత కలెక్టరేట్‌ల ఎదుట జిల్లాను ప్రారంభించే మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, ఆ తర్వాత జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని కొందరు మంత్రులు సూచించగా ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అన్ని జిల్లాల్లో ఒకే ముహూర్తానికి జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించడానికి రెండు రోజులలో శుభముహూర్తాన్ని పంచాంగకర్తల చేత ఖరారు చేయించి కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇలా ఉండగా కొత్త జిల్లాలు కొన్నింటికి తెలంగాణ మహనీయుల పేర్లు పెట్టాలన్న దానిపై కూడా మంత్రిమండలిలో చర్చించినట్టు తెలిసింది. గద్వాల జిల్లాకు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్న అంశంపై చర్చ జరగగా, జోగులాంబ జిల్లాగా ఇప్పటికే పేరు ఖరారు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించినట్టు తెలిసింది. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని ములుగులో ఏర్పాటు చేసే ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం.