తెలంగాణ

సాగర్‌ను సందర్శించిన ప్రపంచ బౌద్ధ ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 7: నాగార్జునసాగర్ నాడు శుక్రవారం నాడు ప్రపంచ బౌద్ధ ప్రతినిధులు సందర్శించారు. ఈసందర్భంగా తెలంగాణ పర్యాటక సంస్థవారి ప్రత్యేక లాంచిలో నాగార్జునకొండకు చేరుకోని అక్కడ మహాస్థూపాన్ని, సింహళ విహారాన్ని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి పునర్‌నిర్మిత స్థూపాలను, విహారాలను శ్రద్ధతో వీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జునసాగర్ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని బుద్ధిస్ట్ సర్క్యూట్‌లలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, తెలంగాణ టూరిజం వారి ఆహ్వానంపై నాగార్జునసాగర్‌తోపాటు తెలంగాణాలోని పలు బౌద్ధ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈసందర్భంగా తెలంగాణ టూరిజం జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ఈనెల వారణాసి, బుద్ధగయాలో నిర్వహించిన ప్రపంచ బౌద్ధ సమ్మేళనానికి హాజరైన ప్రతినిధులను తెలంగాణ టూరిజం రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఆహ్వానించిందన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నాగార్జునసాగర్‌కు చేరుకున్న ఈ బృందం నాగార్జునకొండను సందర్శించిందని, శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం నల్లగొండ జిల్లాలోని ఫణిగిరి క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు. ఆపై వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో పర్యటించిన అనంతరం 11వ తేదీన ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే బతుకమ్మ సంబురాలలో పాల్గొంటారని తెలిపారు. సుమారు 14దేశాలకు చెందిన ప్రతినిధులు శుక్రవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారని, వీరిలో బౌద్ధమత అంబాసిడర్లతోపాటు టూర్ ఏజెన్సీలు, వివిద దేశాల అంబాసిడర్లు ఉన్నారన్నారు. వీరి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల గురించి వాళ్ల దేశాల్లో ప్రచారం జరుగుతుందన్నారు. వీరితోపాటు రాష్ట్ర పురావస్తుశాఖ ప్రత్యేక అధికారి రంగాచార్యులు, నల్లగొండ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, ఎఎం సత్యం, శ్యాంసుందర్, సాయి, సాయిరాం, గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.