తెలంగాణ

ప్రభుత్వ ముద్రణకే ఇక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: ఇకపై ప్రభుత్వ ముద్రణ పనులు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లకే అప్పగించనున్నట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌కు పూర్వ వైభవం తీసుకు వచ్చే కృషి చేస్తున్నట్టు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ప్రైవేటు ప్రెస్సులను ప్రోత్సహించి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఖైరతాబాద్‌లోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్‌లో కొత్త మిషన్‌లను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. గతంలో ప్రభుత్వం ప్రింట్ చేయాల్సిన పనులు అన్ని కూడా ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్‌లకు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారికి ఎక్కువ పని కల్పించేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. అన్నం పెడుతున్న ప్రింటింగ్ ప్రెస్‌ను కార్మికులు కూడా సొంత ఆస్తిగా చూసుకోవాలని అన్నారు. ప్రెస్‌లో ఉన్న అమ్మవారి గుడిలో ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు జరిపారు. నవరాత్రుల సందర్భంగా దుర్గా ప్రతిమను ఏర్పాటు చేశారు. మంత్రి పోతరాజులతో కాలు కదిపారు. ప్రింటింగ్ ప్రెస్ యూనియన్ అధ్యక్షుడు గజ్జెల నగేష్‌తోపాటు కార్మికులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.