తెలంగాణ

మియాపూర్‌లో భారీ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ శేరిలింగంపల్లి, అక్టోబర్ 7: మియాపూర్‌లో భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు అర్ధరాత్రి తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాలు ధ్వంసం చేసి సుమారు 20లక్షల రూపాయల విలువచేసే 70 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి వస్తువులు దోచుకుని ఉడాయించారు. పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా బీరువాపై నీళ్ళు కుమ్మరించి పారిపోయారు. ఈ చోరీ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్‌పరిధిలో జరిగింది. మియాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోగల లేక్‌వ్యూ ఎన్‌క్లేవ్‌లోని నాలుగవ అంతస్తు, ఫ్లాట్ నెంబర్ 4ఎస్ లో ప్రభావతి నివసిస్తుంది. టర్బో మెషినరీ ఇండస్ట్రీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొడుకు అమర్‌నాథ్ కంపెనీ పనిమీద సెప్టెంబరు 31న ముంబయి వెళ్ళాడు. కోడలు నిత్య అంతకుముందే 26వ తేదీన పుట్టింటికి కడపకు వెళ్ళిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఆరవ తేదీ రాత్రి పది గంటలకు ఇంటికి తాళంవేసి అదే బ్లాకులో ఉంటున్న కూతురు విజయ ఇంటికి వెళ్ళి పడుకుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా అంతా చిందరవందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించింది. దాంతో పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి మియాపూర్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కొత్వాల్, ఎస్‌ఐలు సిబ్బంది వచ్చి పరిశీలించారు. కూకట్‌పల్లి ఎసిపి భుజంగరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు, క్లూస్ టీం అధికారులు సంఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. పోలీసులకు ఆధారాలు లభ్యం కాకుండా బీరువాతో పాటు దొంగలు తాకిన వస్తువులపై నీళ్ళు చల్లడంతో పాత నేరస్థులే అయి ఉంటారని భావిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మియాపూర్‌లో చోరీకి పాల్పడ్డ దొంగలు బీరువా
పగులగొట్టి వస్తువులు చిందరవందరగా పడేసిన దృశ్యం