తెలంగాణ

అది తప్పుల తడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, అక్టోబర్ 7: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కేవలం నిరాశ, నిస్పృహతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని రూపన్‌వాలా కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని యూనివర్సిటీ జెఎసి నాయకులు విమర్శించారు. రూపన్‌వాలా నివేదికను వ్యతిరేకిస్తూ శుక్రవారం యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం షాపింగ్ కాంప్లెక్స్ నుండి ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పాత ముంబయి రోడ్డుపై బైఠాయించారు. తరువాత రూపన్ వాలా దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఈ సందర్భంగా కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ న్యాయాన్ని నిరాకరించినా, నిర్లక్ష్యం చేసినా నేరస్తులేనన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు గల కారణాల గురించి నివేదిక ఇమ్మంటే అతను ఎస్సీ కాదని, నిస్పృహతో ఆత్మహత్య చేసుకున్నాడని తన నివేదికలో రూపన్‌వాలా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ ఎప్పుడో రోహిత్ షెడ్యూల్ కులస్తుడని చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
కేంద్రమంత్రులు స్మృతి ఇరానీని, బండారు దత్తాత్రేయను, విసి అప్పారావును, ఎమ్మెల్సీ రామచంద్రరావును, సుశీల్ కుమార్‌లను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకుడు విజయ్ మాట్లాడుతూ రూపన్ వాలా కేంద్ర ప్రభుత్వం నియమించిన వారే కనుక బిజెపికి అనుకూలంగా నివేదిక ఇచ్చారన్నారు. సుప్రీంకోర్టుకు అనుబంధంగా నడిచే కమిటీని వేసి దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు ప్రశాంత్, మున్నా, వెంకటేష్ చౌహాన్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను రోడ్డుమీదకు తెచ్చి నినాదాలు చేయడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చచెప్పి పక్కకు పంపించారు.