తెలంగాణ

ప్రపంచ రికార్డు బతుకమ్మ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా ఒకేచోట, ఒకేసారి 15వేల మంది మహిళలు బతుకమ్మ ఆడనున్నారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం మహా బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు రెండు గంటల పాటు పదిహేను వేల మంది బతుకమ్మ ఆడుతారు. స్వయం సహాయక బృందాల మహిళలు పదివేల మంది, ఇతరులు ఐదువేల మంది మొత్తం పదిహేను వేల మంది శనివారం బతుకమ్మ ఆడుతారు. గతంలో ఓనమ్ ప్రపంచ రికార్డుగా నమోదు అయింది. 5200 మంది మహిళలు ఓనమ్ వేడుకల్లో పాల్గొనడం ప్రపంచ రికార్డు. ఇప్పుడు ఓనమ్ రికార్డును తిరగరాసే విధంగా బతుకమ్మను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి స్వయం సహాయక బృందాల మహిళలు బతుకమ్మలతో ఎల్‌బి స్టేడియంలోని టెన్నిస్ ఇండోర్ స్టేడియంకు చేరుకుంటారు. 20 అడుగుల భారీ బతుకమ్మను మధ్యలో అమర్చుతారు. దాని చుట్టూ చిన్న బతుకమ్మలు ఉంటాయి. 15వేల మంది మహిళలు బతుకమ్మ ఆడే వేడుకలను సందర్శించేందుకు దాదాపు 50వేల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు శనివారం నాటి బతుకమ్మ వేడుకలకు హాజరవుతున్నారు. ఎల్‌బి స్టేడియంలో జరిగే బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కలెక్టర్ నిర్మల, పర్యాటక శాఖ ఎండి సుమిత్ సింగ్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.