తెలంగాణ

ఫిరాయంపులపై 19న ‘సుప్రీం’ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: వివిధ పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించడంపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఒక అడుగు ముందుకు పడింది. ఫిరాయింపులపై ఈ నెల 19న సుప్రీం కోర్టు విచారించనుంది. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 47 మంది ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరారు. వీరిలో 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే టిడిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బిఎస్‌పి, సిపిఐ నుంచి ఒక్కొక్కరు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనా చారికి ఇదివరకే నోటీసు పంపించింది. కౌన్సిల్‌లో ఉన్న తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీలు టిఆర్‌ఎస్‌లో చేరారని, టిడిపి ఆ పార్టీలో విలీనమైందని లెజిస్లేచర్ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారంటూ ఆ పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో తాము చేసిన విన్నపంపై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించి ఈ నెల 19న విచారణకు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ఇతర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో అనర్హత పిటిషన్లపై వాదిస్తున్న మాజీ సొలిసిటర్ జనరల్, కాంగ్రెస్ ఎంపి వివేక్ తన్‌ఖాను సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ ప్రభృతులు కలిసి ఈ అంశంపై చర్చించారు. అనర్హత పిటిషన్లపై తాము విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని షబ్బీర్ అలీ వ్యక్తం చేశారు.