తెలంగాణ

రైతుల సమస్యలపై 20నుంచి ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి రెండున్నర ఏళ్ళు గడిచినందున, ప్రభుత్వ వైఫల్యాలపై ఇక ప్రజా ఆందోళనలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు మండల స్థాయిలో రైతుల సమస్యలపై ఉద్యమించనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, జి. ప్రేమేందర్ రెడ్డి, ప్రసాద్ కుమార్, కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. మండల స్థాయిలో పంట రుణాల మాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తనాలకు సబ్సిడీ, మున్సిపాలిటీలలో డబుల్ బెడ్ రూంల నిర్మాణం చేయకపోవడం, పాత బిల్లులు చెల్లించకపోవడం వంటి స్థానిక సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోల వంటి ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని వారు తెలిపారు. వచ్చే నెల 7 నుంచి 11వ తేదీ వరకు జిల్లా సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు వారు చెప్పారు. ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని తుంగలో తొక్కిందని వారు విమర్శించారు. కొంత మంది ప్రజాప్రతినిధులను సంతృప్తిపరిచేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను చేపట్టారని వారు విమర్శించారు. రాష్ట్రంలో మాఫియా స్వైరవిహారం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వారికి దక్కకుండా చేయడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏయే కార్యక్రమాలకు మళ్లించారో, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులేమిటో తెలియజేస్తూ శే్వతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారం చేపట్టగానే ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిపిస్తామన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు.