తెలంగాణ

హైదరాబాద్ ఆర్టీఏలో సిబ్బంది కొరత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరగడంతో రవాణశాఖలో సిబ్బంది కొరత తలెత్తింది. కొత్త జిల్లాల్లో ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. రాష్ట్రంలో ఎక్కడాలేని రద్దీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఉంది. స్లాట్ బుకింగ్ కోసం వారం, పది రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసినా కౌంటర్‌ల వద్దకు వచ్చే వారికి పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 12 ఆర్టీఏ కార్యాలయాలు ప్రతి రోజూ కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ రద్దీకి సరిపడా సిబ్బంది లేకపోవడంతో సకాలంలో సేవలందించలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. హైదరాబాద్ జిల్లా బండ్లగూడలోని ఆర్టీఏ కార్యాలయంలో నలుగురు ఎంవిఐ (మోటారు వెహికిల్ ఇన్స్‌పెక్టర్)లు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు. ఇలా ప్రతి కార్యాలయంలోనూ ఎంవిఐ, ఏఎంవిఐ, సీనియర్ క్లర్కుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగడంతో ఇప్పటి వరకూ ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.