తెలంగాణ

నేడు వరంగల్‌కు సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొక్కుకున్నట్లుగానే వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం బహూకరించనున్నారు. దాదాపు 3.60 కోట్ల రూపాయలతో 11 కిలోల బంగారంతో తయారు చేయించిన ఈ కిరీటాన్ని అమ్మవారికి బహూకరించనున్నారు. ఈమేరకు ఆదివారం సిఎం కెసిఆర్ సతీసమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకోనున్నారు. సిఎం రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ వాకాటి కరుణ శనివారం భద్రకాళి దేవస్ధానానికి చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో సిపి సుధీర్‌బాబు పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. దేవాలయం ప్రాంగణంలో సాయుధ పోలీసు పహారా ఏర్పాటు చేయడంతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆలయాన్ని నిశితంగా డాగ్, బాంబు స్కాడ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించడంతోపాటు రోడ్డు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. సిఎం కెసిఆర్ హైదరాబాద్ నుండి హెలిక్యాప్టర్‌లో బయలుదేరిన దగ్గర నుండే వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని సూచించారు. ఇందుకోసం వరంగల్ నుండి వచ్చే వాహనాలు ఎంజిఎం వయా హంటర్‌రోడ్డు మీదిగా మల్లించాలని అన్నారు. అదే విధంగా కాజీపేట నుండి వచ్చే వాహనాలు కెయుసి, వంద ఫీట్లరోడ్డు, కెయుసి జంక్షన్, పెద్దమ్మగడ్డ జంక్షన్, హనుమాన్ జంక్షన్, ఆటోనగర్, పోచమ్మమైదానం మీదుగా ట్రాఫిక్ మల్లించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సిఎం పర్యటన సందర్భంగా భద్రకాళీ దేవాలయంలో భక్తులను ఉదయం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే దేవాలయ ప్రధాన మార్గంగుండా అనుమతిస్తారని, ఉదయం ఎనిమిది గంటల నుండి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులను అలంకారు టాకీసు జంక్షన్, కాపువాడ, వేదపాఠశాల మీదుగా భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సిఎం భధ్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నందున భక్తులు సహకరించాలని కోరారు. అనంతరం సిపి సుధీర్‌బాబు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎం వరంగల్ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, కలెక్టర్ వాకాటి కరుణ, మేయర్ నన్నపనేని న రేందర్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.