తెలంగాణ

కొత్త జిల్లాలపై తొందరేముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: రాష్ట్రంలో దసరా పండుగ నాటికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తొందరపడకుండా అఖిలపక్షంతో చర్చించాక దీపావళి పండుగకు కొత్త జిల్లాలను ప్రారంభించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. శనివారం ఆయన శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంకట్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కొత్త జిల్లాల ఏర్పాటు గురించి అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి అశాస్ర్తియంగా చేపట్టారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఒక జిల్లాలో 40 లక్షల జనాభా ఉంటే, ఒక జిల్లాలో ఐదు లక్షల జనాభా ఉందని, 11 జిల్లాల్లో 10 లక్షల లోపు జనాభా ఉందని తెలిపారు. జిల్లాల పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఒక వ్యక్తికి ఏదైనా ఆలోచన వస్తే అదే తుది నిర్ణయం అంటే ఎలా అని ఆయన పరోక్షంగా కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా అన్ని పార్టీలతో చర్చించి, దీపావళికి కొత్త జిల్లాలను ప్రారంభించాలని ఆయన సూచించారు.
రెండున్నర లక్షల మంది
ఉద్యోగులకు జీతాలు లేవు
ఇదిలావుంటే, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయకపోవడంతో అనేక కళాశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో పని చేస్తున్న రెండున్నర లక్షల మంది అధ్యాపకులకు, ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు లేవని ఆయన తెలిపారు. 2014-15 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 2,140 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఏప్రిల్‌లోగా బకాయిలన్నింటినీ చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు ఒక్క రూపాయి విడుదల కాలేదని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను దశల వారీగా చెల్లించామన్నారు. ఉన్నత విద్య కోసం విద్యార్థులు తమ సర్ట్ఫికెట్లను ఇవ్వాలని కోరితే డబ్బు చెల్లించి తీసుకెళ్ళాలని యజమాన్యాలు చెబుతున్నాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రతిపక్షాలను అవమానించారు..
షబ్బీర్ అలీ మాట్లాడుతూ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను, ప్రతిపక్షాలను అవమానపరిచారని విమర్శించారు. జిల్లాల ఏర్పాటు శాస్ర్తియంగా లేదని తాము చెబితే మరో రెండు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించండి అని కెసిఆర్ సిఎస్‌కు సూచించారని ఆయన చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కెసిఆర్ నిలబెట్టుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించామని మహ్మద్ షబ్బీర్ అలీ గుర్తు చేశారు.