తెలంగాణ

సంబరంగా బతుకమ్మ ఆటాపాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత పెద్దనగరమైన వరంగల్‌లో మహిళల సంప్రదాయ పండుగ సద్దుల బతుకమ్మ శనివారం సంబరంగా, కోలాహలంగా జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుంచే కొత్తబట్టలు, నగలు ధరించిన మహిళలు సద్దుల బతుకమ్మ ఆడేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలటం ప్రారంభించారు. నగరంలోని పద్మాక్షి దేవాలయం, భద్రకాళి దేవాలయం, రంగలీలా మైదానం, వడ్డేపల్లి చెరువు తదితర ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ పండగ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. భద్రకాళి దేవాలయం వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ ఉత్సవంలో కలెక్టర్ వాకాటి కరుణ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తంగేడు, గునుగు, చామంతి తదితర పూలతో అందంగా తయారుచేసిన వివిధ సైజుల బతుకమ్మలను తీసుకుని ఆయా ప్రాంతాలకు తరలివెడుతున్న సందర్భంలో ప్రధాన వీధులు ఎంతో సందడిగా కనిపించింది.