తెలంగాణ

సిఎంకు ములుగు సెగ తగిలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 8: వరంగల్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యమం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినా ములుగు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు ఉధ్దృతం అవుతోంది. ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క, అఖిలపక్ష నాయకులు పురుగుల మందు చేతబూని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ములుగు, మంగపేట, ఏటూరునాగారం మండలాలకు చెందిని జెడ్పీటిసిలు, మరో ఇద్దరు ఎంపిటిసిలు కూడా రాజీనామా చేసారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం వరంగల్ పర్యటన నేపధ్యంలో ములుగు అఖిలక్షం అధ్వర్యంలో దాదాపు 100 వాహనాల్లో బయలుదేరి సిఎం ముందు నిరసన సెగ వ్యక్తం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకోసం వ్యూహాత్మకంగా అఖిలపక్ష నేతలు వ్యవహరిస్తున్నారు. ఇక కాదనుకున్న జనగామ, గద్వాల, సిరిసిల్ల, అసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసిన సిఎం కెసిఆర్ ములుగు జిల్లా ఏర్పాటు విషయంలో పక్షపాతధోరణిని వ్యవహరిస్తున్నారని ములుగు ప్రాంత ప్రజలు సిఎం కెసిఆర్‌పై గుర్రుగా ఉన్నారు. అయితే, వరంగల్‌లో సిఎం పర్యటన నేపథ్యంలో అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే ముందస్తుగా ములుగు జిల్లా ఏర్పాటు అంటూ లీక్‌లు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ములుగును జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా వివిధ రూపాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ములుగును సమ్మక్క - సారాలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తుండడంతో మంత్రి చందూలాల్‌పై కూడ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ములుగు జిల్లాను చేయడంలో సిఎంను ఒప్పించే దమ్ము, ధైర్యం మంత్రి చందూలాల్‌కు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగును జిల్లా ఏర్పాటు చేయించడంలో విఫలమైన మంత్రి చందూలాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ములుగు జిల్లా కేంద్రంగా కావడానికి అన్ని హంగులు ఉన్నా ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులపై ఉన్న చిత్తశుద్దిని చాటుకునేందుకు వెంటనే ఏజన్సీ ప్రాంతమైన ములుగును జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ
క్రిమిసంహారక మందు డబ్బాలతో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నాయకులు