తెలంగాణ

బాసరలో అక్షర నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, అక్టోబర్ 8: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర అమ్మవారి సన్నిధిలో శనివారం అక్షరనీరాజనం ఏర్పడింది. శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు కాలరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూల నక్షత్రం సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను జరిపించేందుకు భక్తులు పోటెత్తారు. వేకువజామున 4 గంటల నుండి చిన్నారులు భక్తు లు ప్రత్యేక అక్షరాబ్యాస క్యూలైన్‌లలో భారు లు తీరారు. అక్షరాభ్యాస పూజలకు ఒక్కోబ్యాచ్‌కు 2 గంటల సమయం పట్టడంతో భక్తులు, చిన్నారులు వర్షంలోనే తడుస్తూ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 11 గంటలకు అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మద్య మూల నక్షత్ర సరస్వతి పూజ ను వేడుకగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనాలు అందుకున్నారు. 2790 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాలు, అక్షరాభ్యాస పూజల ద్వారా ఆలయానికి ఒక్కరోజే 15 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది.
రీజినల్ జాయింట్ కమీషనర్ ఇడుపులపాటి శ్రీనివాస్‌రావు, ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, జిల్లా డిఆర్‌డిఎ పిడి అరుణకుమారి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముధోల్ సి ఐ రఘుపతి ఆధ్వర్యంలో బాసర ఎస్సై మహేష్ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

బాసరలో చిన్నారులకు అక్షరస్వీకార పూజలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు