తెలంగాణ

ఆస్ట్రేలియాలో బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: ఆస్ట్రేలియాలో సద్దుల బతుకమ్మ ఘనంగా జరిగింది. సిడ్నీ నగరం బతుకమ్మ ఆటపాటలతో పులకించింది. ఈ వేడుకలను ఆ ప్రాంత ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా వెళ్లారు. ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల వారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి, తెరాస ఎన్నారై శాఖల ప్రతినిధులు, ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఆస్ట్రేలియాలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రవాస
భారతీయులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత