తెలంగాణ

సిఎం దత్తత గ్రామంలో.. కుప్పకూలిన డబుల్ బెడ్‌రూం ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి, అక్టోబర్ 9: సిఎం దత్తత గ్రామం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌లో శనివారం డబుల్ బెడ్‌రూం ఇల్లు కుప్పకూలింది. రాష్ట్రంలోనే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృధ్ధి చేసి నిలపాలనే సిఎం తపనకు, ఆలోచనకు బ్రేక్ వేసే ప్రయత్నాల్లో భాగంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్ అడుగులకు మడుగులొత్తి జీ..హుజూర్ అంటూ తలొగ్గుతున్న దుస్థితి. అట్టి గ్రామానికి ఆర్‌డివో స్థాయి అధికారి ప్రత్యేకాధికారిగా నియమించినప్పటికీ ఫలితం శూన్యం. వివరాల్లోకి వెళ్తే..చినముల్కనూర్ గ్రామానికి చెందిన కయ్యం విజయ-రాజు అనే లబ్దిదారురాలు ఇల్లు గత ఇరవై రోజుల క్రితం నుంచి నిర్మిస్తున్నారు. ఇల్లు నిర్మాణ దశలో స్లాబ్ వేయడానికి ఐరన్ రాడ్‌లకు బదులు కొన్ని చోట్ల కర్రలతో నిర్మాణ పనులు చేపడుతున్నారు. అదిగో వేస్తాం..దిగో వేస్తాం అంటూ ఆశ చూపి తీరా కర్రల అమరిక సమతుల్యత దెబ్బతిని, నాణ్యత లోపంతో స్లాబ్ కుప్పుకూలింది. సెంట్రింగ్ చెక్కల పరిస్థితి అంచనా వేయకుండా, పటిష్టతపై ఆరా తీయకుండా అందిదే తడువుగా హాడావిడిగా తడి మిశ్రమం వేశారు. స్లాబ్‌కు శాస్ర్తియంగా అమర్చవల్సిన సలాఖ పరిణామం తక్కువగా ఉండటం, వాటి అల్లికలో లోపం, కింద సపోర్టు సెంట్రింగ్ చెక్కలు కుంగిపోవడం వంటి లోపాలు స్లాబ్ కుప్పుకూలిపోవడానికి ప్రధాన కారణలయ్యాయి. పని మొదలు పెట్టిన కొద్ది సేపట్లోనే భారీ శబ్దంతో కూలిపోవడంతో లబ్దిదారుడి గుండె గుభిల్లుమంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర మనస్థాపం చెందారు. హుటాహుటిన గుత్తేదారుడి అనుచరుడిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం దత్తత గ్రామంలో ఈతతంగం జరగడం పలు విమర్శలకు తావిస్తోంది.

చిత్రం.. సిఎం దత్తత తీసుకున్న చిన ముల్కనూర్ గ్రామంలో
కుప్పకూలిన డబుల్ బెడ్‌రూం ఇల్లు