తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, అక్టోబర్ 9: మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (40) అలంపూర్ చౌరస్తాలోని ఫ్లై ఓవర్‌పై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి అనంతపురంకు వెళ్తున్న డిసిఎం ఢీకొట్టింది. దీంతో కిందపడిన వ్యక్తి డిసిఎం కింద ఉన్న హౌసింగ్‌కు తగులుకొని డిసిఎంతో పాటు రెండు కిలోమీటర్ల రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో ఫ్లై ఓవర్ రక్తంధారలు పారింది. టోల్‌గేట్ సమీపంలో వెనుక వస్తున్న వాహనాల లైటింగ్ ద్వారా డిసిఎం కింద ఉన్న వ్యక్తిని గుర్తించి డిసిఎం డ్రైవర్‌కు తెలిపారు. డ్రైవర్ వాహనం నిలిపి వ్యక్తి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం అలంపూర్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తి చొక్కాపై కర్నూల్ జిల్లా గుత్తిలో కుట్టించినట్లు తెలిసిందన్నారు. డిసిఎం వాహనం ముందు భాగంలో ఎటువంటి ప్రమాద గుర్తులు కనిపించడంలేదు. డిసిఎం కింద వెనుకభాగంలోని హౌసింగ్‌తో పాటు రక్షణ కడ్డీకి రక్తంతో కూడిన చిన్నపాటి శరీరం ముద్దలు కనిపించాయి. లారీ డ్రైవర్ పాండు మాత్రం రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని గుర్తించి టైరు ఎక్కించకుండా మధ్యలో వెళ్లినట్లు పేర్కొన్నాడు.