తెలంగాణ

ఎస్‌ఆర్‌ఎస్‌పి 42గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, అక్టోబర్ 9: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి వరదనీటి ఉద్ధృతి పెరగడంతో అధికారులు మరోమారు ఆదివారం రిజర్వాయర్‌కు చెందిన 42గేట్లను ఎత్తివేశారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన మహారాష్టల్రోని విష్ణుపురి ప్రాజెక్టు మిగులు జలాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో రిజర్వాయర్‌లోకి 3.20లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 1091.00అడుగులు 90టిఎంసిల కెపాసిటి గల రిజర్వాయర్‌ను అదే స్థాయిలో నీటిని నిల్వ ఉంచుతూ, ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాల్వలైన కాకతీయకు 5వేలు, సరస్వతికి 1000క్యూసెక్కులు, లక్ష్మికి 300, వరదకాల్వకు 16,500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే రిజర్వాయర్‌కు చెందిన 42వరద గేట్ల ద్వారా 3లక్షల 3వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

చిత్రం.. ఎస్సారెస్పీ 42వరద గేట్ల ద్వారా దిగువకు విడుదల అవుతున్న మిగులు జలాలు