తెలంగాణ

మళ్లీ మంజీర పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 9: మంజీర నది పరివాహక ప్రాంతాలు, సింగూర్ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద పోటు మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి పశ్చిన మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలకు వరద పెరిగింది. దీంతో ఆదివారం ఉదయం సాగునీటి పారుదల శాఖ అధికారులు రెండు మీటర్ల చొప్పున రెండు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్‌కు వదిలిపెడుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు అంచనా వేసారు. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 29.99 టిఎంసిలుకాగా ప్రస్తుతానికి 29.4 టిఎంసిల నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో ఎంత మొత్తంలో వరద వచ్చి చేరుతుందో అంతే మొత్తంలో దిగువకు వదిలిపెడుతున్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వర్షం నిలిచిపోవడంతో వరద ఉదృతి తగ్గింది. దీంతో రెండు రోజుల క్రితం ప్రాజెక్టు గేట్లను నిలిపివేసారు. ఎగువన వర్షాలు కురియడంతో కథ మళ్లీ మొదటికి వచ్చి చేరింది. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తూ లక్షలాది మంది భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఏడుపాయల వనదుర్గా దేవి పక్షం రోజులుగా నిత్య పూజలు అందుకోవడం లేదు. ఏడుపాయలు పొంగి ప్రవహిస్తుండడంతో అమ్మవారి ఆలయానికి వెళ్లే దారులు మూసుకుపోయాయి. పదిహేను రోజులుగా ఏమాత్రం వరద తగ్గకుండా మంజీర నది గలగల పారుతోంది. వరద తగ్గుముఖం పట్టిందన్న సంతోషం కేవలం రెండు రోజులకే పరిమితమైంది.

సింగూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో ఉరకలేస్తున్న మంజీర నది (ఫైల్ ఫొటో)