తెలంగాణ

సిఎం కెసిఆర్ దసరా, కొత్త జిల్లాల ఏర్పాటు శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 9: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు దసరా, నూతన జిల్లాల ఏర్పాటు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వరంగల్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు గొప్పగా జరిగాయని, వచ్చే సంవత్సరం మహిళలు బతుకమ్మ ఉత్సవాలను మరింత గొప్పగా జరుపుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. నూతన జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వ పాలన ప్రజల వద్దకే వెళ్తోందని అన్నారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొత్త జిల్లాల పేరిట వరంగల్ జిల్లా నుండి కేవలం చేర్యాల, మద్దూరు రెండు మండలాలు మాత్రమే సిద్దిపేట జిల్లాలో కలుస్తున్నాయని, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల నుండి 12 మండలాలు వరంగల్‌లో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలో కలుస్తున్నాయని సిఎం వెల్లడించారు.