తెలంగాణ

లెక్క తేలింది.. జిల్లాలు 31!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటు లెక్కతేలింది. 31 జిల్లాలతో నేడోరేపో మంత్రివర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల ఏర్పాటు ఫైనల్ ముసాయిదాను విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈవిషయాన్ని స్వయంగా సిఎం కెసిఆర్ ఆదివారం వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. వరంగల్‌లో ములుగు జిల్లా ఏర్పాటు చేసేది లేదని సిఎం కెసిఆర్ కుండబద్దలు కొట్టి చెప్పారు. ప్రజలు అడుగుతున్నారు కదా అని ఊరుకో జిల్లా చేయలేమని ఆయన తేల్చిచెప్పారు. జిల్లా ఏర్పాటుపై శాస్ర్తియత అంటున్నవారు ముందుగా శాస్ర్తియత అంటే ఏమిటో చెప్పాలన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కాని ప్రాంతాలలో ప్రత్యేక ప్యాకేజీలు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లా ఏర్పాటుపై కూడా సిఎం స్పష్టతనిచ్చారు. వరంగల్, హన్మకొండ జిల్లాలు ఉండాలని తాను కోరుకున్నానని, అయితే కొందరు చారిత్రక నగరాన్ని విడదీయవద్దంటూ అభ్యంతరం చెప్పడంతో వరంగల్ పట్టణ పరిధిని వరంగల్ అర బన్ జిల్లాగా, నర్సంపేట, పరకాల, వర్థన్నపేట జిల్లాలను కలిపి రూరల్ జిల్లాగా వరంగల్ కేంద్రంగానే ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం స్పష్టం చేసారు. దీంతో హన్మకొండ జిల్లా ఏర్పాటు ఉత్కంఠకు సిఎం తెరదించారు. వరంగల్‌లో జిల్లాలో.. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్, జనగామ, మహాబూబాబాద్ జిల్లాల ఏర్పాటుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు.