తెలంగాణ

న్యూజిలాండ్‌లో పూల సంబురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: బతుకమ్మ పాటలు న్యూజిలాండ్‌లో మార్మోగాయి. ఆ దేశ రాజధాని ఆక్లాండ్ సిటీ బతుకమ్మ ఆట పాటలతో పులకించింది. తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ, న్యూజిలాండ్ తెలంగాణ సంఘం సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువుగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబురాలకు హాజరయ్యారు. ఆక్లాండ్‌లో ఉన్న తెలంగాణ కుటుంబాలు బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ పల్లెల్లో కనిపించే బతుకమ్మ వాతావరణం ఆక్లాండ్‌లో కనిపించి అందరినీ ముచ్చట గొలిపింది. న్యూజిలాండ్ తెలంగాణ సంఘం అధ్యక్షులు కళ్యాణ్‌రావు కాసుగంటి, ప్రధాన కార్యదర్శి దయాకర్ బచ్చు, కోశాధికారి దయానంద్ కటకం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో బతుకమ్మను పేర్చుతున్న
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత