తెలంగాణ

భద్రకాళికి స్వర్ణ కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 9: తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వరంగల్ భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొక్కులు చెల్లించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమ్మవారిని దర్శించుకొన్న కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే బంగారు కిరీటం బహూకరిస్తానని మొక్కుకున్నారు. దీంతో మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు మూలా నక్షత్రం భద్రకాళి అమ్మవారి దివ్యమైన పుట్టినరోజు పురస్కరించుకొని అమ్మవారికి స్వర్ణకిరీటం బహూకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం సరిగ్గా 11.17 నిమిషాలకు దేవాలయానికి చేరుకున్న సిఎం దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. భారీ కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు అమ్మవారి సన్నిధిలోనే గంటసేపు గడిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వర్ణ కిరీటం బహూకరిస్తానని మొక్కుకున్నందున మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చానని అన్నారు. అమ్మ దయవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు.
అమ్మవారికి అలంకరించిన స్వర్ణ కిరీటంతో ఊహించనంత గొప్ప ప్రభగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారని అన్నారు. హన్మకొండలోని పద్మాక్షమ్మదేవాలయం, మడికొండలోని మొట్టురామలింగేశ్వరస్వామి దేవాయాలను అభివృద్ధి చేసి, గొప్ప పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సిఎం తెలిపారు. సిఎం కెసిఆర్ దంపతుల దర్శనం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రధాన ద్వారం గుండా భక్తులకు దర్శనం నిలిపివేసారు. 12 గంటల తరువాత యధావిధిగా దర్శన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సిఎం వెంట డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, ఎంపిలు సీతారాంనాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.

భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటాలు తీసుకువస్తున్న సిఎం దంపతులు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి,
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చిత్రంలో ఉన్నారు