తెలంగాణ

విభజనకు వేళాయెరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: దసరా పర్వదినమైన మంగళవారం ఉదయం 11 గంటల 13 నిమిషాలకు కొత్త జిల్లాల ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాలతోపాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలు, పోలీస్ కమిషనరేట్లు, పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ సర్కిళ్లు, కొత్త పోలీస్ స్టేషన్లను ఏకకాలంలో ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్‌ఓలు, తహశీల్దార్లు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిస్పీలు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లు, కొత్త కమిషనరేట్లకు కమిషనర్ల నియామకం ఇప్పటికే పూరె్తైంది. అయితే తుది నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వీరందరికీ మంగళవారం తేదీలతో జారీ చేసే ఉత్తర్వులను సోమవారమే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నియమితులైన కొత్త కలెక్టర్లకు సిఎస్ రాజీవ్ శర్మ, ఎస్పీలకు డిజిపి అనురాగ శర్మ వౌఖికంగా సమాచారం అందించారు. వీరంతా సోమవారం ఉత్తర్వులు అందుకుని సాయంత్రం ఐదింటికల్లా గమ్యస్థానాలకు చేరుకొని సిఎస్, డిజిపిలకు రిపోర్టు ఇవ్వాలని వౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు అధికార వర్గాల సమాచారం. తుది నోటిఫికేషన్‌కు లోబడి జరుగుతున్న ఉత్తర్వులను మంగళవారం ఉదయం విధుల్లో చేరిన తరువాతే బహిర్గతం చేయాలని గట్టిగా సూచించినట్టు చెబుతున్నారు. కొత్త జిల్లాలు ప్రారంభించే బాధ్యతలను 17 మంత్రులకు, స్పీకర్, శాసనమండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించిన విషయం తెలిసిందే. కొత్త జిల్లా కేంద్రాలను ప్రారంభించే మంత్రులు ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సంబంధిత మంత్రులు కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేలా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. వీటితోపాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలు, పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలను ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు. ఏమ్మెల్సీలు ప్రారంభించనున్నారు. ఎవరు ఎక్కడ ఏం ప్రారంభిస్తారన్న సమాచారాన్ని ఇప్పటికే ఖరారు చేసి సంబంధిత ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అందించింది. ఇలావుండగా, ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన నాలుగు పోలీస్ కమిషనరేట్లతోపాటు ఖమ్మంలోనూ కమిషనరేట్ ఏర్పాటు చేయాల్సిందిగా సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనికోసం ఆదివారం రాత్రిగానీ, సోమవారం ఉదయంగానీ ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అలాగే షాద్‌నగర్ రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకూ సిఎం ఆదివారం నిర్ణయించారు. తుది నోటిఫికేషన్‌లో షాద్‌నగర్ రెవిన్యూ డివిజన్ చేర్చడంతోపాటు అక్కడ ఎమ్మార్వో కార్యాలయంలో రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని, అలాగే ఇదే జిల్లా పరిధిలోకి వచ్చిన నందిగామలో మండల కేంద్రాన్ని ఆగమేఘాలపై ఏర్పాటు చేయాల్సిందిగా శంషాబాద్ (రంగారెడ్డి) జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావును, ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
ఎక్కడా కార్యాలయాలను తరలించవద్దు: సిఎం
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన కార్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప ప్రస్తుత కార్యాలయాలను ఎక్కడికీ తరలించవద్దని సిఎం కె చంద్రశేఖర్‌రావు సిఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో, వరంగల్ జిల్లా ములుగు, మరిపెడలో కొన్ని కార్యాలయాలను తరలించే ప్రయత్నం జరుగుతుందని మంత్రులు లక్ష్మారెడ్డి, చందూలాల్ ఆదివారం సాయంత్రం సిఎంని కలిసి చెప్పారు. వెంటనే స్పందించిన సిఎం, సిఎస్ రాజీవ్ శర్మతో ఫోన్లో మాట్లాడారు. కొత్త కార్యాలయాల కోసం పాత కార్యాలయాలను ఏమాత్రం తరలించవద్దని ఆదేశించారు.

chitram....
వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్