తెలంగాణ

బీసీలకూ ఓవర్సీస్ స్కాలర్ షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సిఎం కెసిఆర్ దసరా కానుకగా ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రకటించారు. దీనికి జ్యోతిరావు ఫూలే బీసీ ఓవర్సీస్ పథకంగా నామకరణం చేస్తూ ఫైలుపై ఆదివారం సంతకం చేశారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే ఈ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈపథకం ప్రకారం విదేశాల్లో విద్యావకాశాల కోసం వెళ్లే విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఈ ఏడాది 300 మంది విద్యార్థులకు రూ.60 కోట్ల సాయం అందించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.