తెలంగాణ

కొత్త జిల్లాలకు కలెక్టర్ల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలో కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల నియామకాల్లో గందరగోళపరిస్థితి ఏర్పడింది. తగినంత మంది ఐఎఎస్ అధికారులు లేకపోవడం ఇందుకు కారణం. ప్రస్తుతం పనిచేస్తున్న 10 జిల్లాల కలెక్టర్లు మినహాయిస్తే మిగతా 21 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమించాలి. అంటే 42 మంది ఐఎఎస్ అధికారుల అవసరం వెంటనే ఉంటుంది. కలెక్టర్ల నియామకానికి ఐదేళ్ల సీనియారిటీ ఉన్న ఐఎఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్ల నియామకానికి రెండేళ్ల సీనియారిటీ ఉన్న ఐఎఎస్ అధికారులు కావాలి. రాష్ట్రంలో ఐదేళ్ల సీనియారిటీ ఉన్న ఐఎఎస్ అధికారులు తగినంత మంది లేరు. కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాల్లో పది జిల్లాలకు కలెక్టర్లను నియమించేందుకు వీలుందని, మిగతా 11 జిల్లాలకు సమీప జిల్లాల్లోని కలెక్టర్లకు తాత్కాలికంగా అదనపు బాధ్యతలను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అవసరం అయితే సీనియారిటీ ఉన్న జాయింట్ కలెక్టర్లను ఇంచార్జి కలెక్టర్లుగా నియమించవచ్చని తెలుస్తోంది. జాయింట్ కలెక్టర్ల పోస్టులకు కూడా ఐఎఎస్ అధికారులు లేరు. 21 మంది జాయింట్ కలెక్టర్లు అవసరం కాగా ఈ పోస్టుకు అర్హులైన వారు ఐదారు మందికి మించి ప్రస్తుతానికి అందుబాటులో లేరు. దాంతో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లుగా నియమిస్తారని తెలుస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం కూలంకషంగా చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం 123 మంది ఐఎఎస్ అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 163 మంది ఐఎఎస్ పోస్టులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) నిర్ణయించింది. రాష్ట్రానికి మరో 44 మంది ఐఎఎస్ అధికారులను కేటాయించాలని సిఎం కెసిఆర్ కేంద్రాన్ని ఆరు నెలల క్రితమే కోరారు. సిఎం కోరిక మేరకు 44 ఐఎఎస్ పోస్టులను తెలంగాణకు కేటాయించేందుకు కేంద్రం ఆమోదించింది. అయితే ఒకే సంవత్సరం ఇంత మంది ఐఎఎస్ అధికారులను ఇవ్వలేమని, మూడునాలుగేళ్లలో కేటాయిస్తామంది.
ఇలా ఉండగా ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లలో అర్హులైన వారికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో గ్రూప్-1 కు చెందిన వారు 22 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా గ్రూప్-2 ఆఫీసర్లుగా నియామకం అయి వేర్వేరు పోస్టుల్లో పనిచేస్తున్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ లభించిన వారిని జిల్లా రెవెన్యూ అధికారులు (డిఆర్‌ఓ) లేదా జాయింట్ కలెక్టర్ల పోస్టుల్లో నియమించేందుకు వీలుంటుంది.