తెలంగాణ

తప్పిన పెనుప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, అక్టోబర్ 10: ఖమ్మం జిల్లా చర్ల మండలం కోరెగడ్డలంకల్లో గోదావరిలో సోమవారం రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో రెండు పడవల్లోని సుమారు 70 మంది కూలీలను స్థానిక జాలర్లు, తోటి కూలీలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చర్ల మండలం గోదావరి నడిమధ్యలో కోరెగడ్డ అనే లంకలు ఉన్నాయి. అక్కడ 500 ఎకరాల్లో మిర్చి ఇతర పంటలు సాగుచేస్తుంటారు. అక్కడకు కూలీలను నిత్యం పడవల ద్వారా తరలించి, తిరిగి తీసుకొస్తుంటారు. సోమవారం కూడా 100 మంది కూలీలు మూడు పడవల్లో లంకకు బయలుదేరారు. ముందు మర ఇంజన్ సాయంతో నడిచే ఒక పడవలో 40 మంది, దానికి కర్రల సాయంతో మరో రెండు పడవలను కట్టి అందులో 60 మందిని ఉంచి తరలిస్తున్నారు. అయితే వెనుక పడవకు రంధ్రం పడి నీరు చేరడంతో కూలీలు హైరానా పడ్డారు. ఉరుకులు పరుగులు పెట్టడంతో ముందు మరపడవ కర్రలు తెగి రెండు పడవలు కొట్టుకుపోయాయి. 60 మంది కూలీలు మునిగిపోతుండటంతో ముందు పడవలోని కొందరు, ఒడ్డుపై ఉన్న జాలర్లు వెంటనే నదిలోకి దూకి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

చెరువులో పడి తల్లీ బిడ్డల మృతి

వెంకటాపురం, అక్టోబర్ 10: చిన్నారి చెల్లెలిని కాపాడడం కోసం అక్క.. ఆ ఇద్దరి రక్షించుకోవాలని కన్నతల్లి పడిన ఆరాటంలో అంతా మృత్యువు వికటాట్టహాసానికి బలైన విషాద సంఘటన ఇది. పండుగ ముందు రోజు సోమవారం ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం సూరవీడుకాలనీలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతకడానికి పిల్లలతో కలిసి వెళ్లిన ఓ తల్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి బిడ్డలతో సహా మృత్యువు పాలయింది. ఈ ఘటనతో సూరవీడు కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూరవీడు కాలనీకి చెందిన ఉయికా కోమల(35) తన కుమార్తెలు పింకు(6), లహరి(15)లతో కలిసి బట్టలు ఉతికేందుకు ఊరు సమీపంలోని కారంకుంట చెరువుకు వెళ్లింది. ఆమె బట్టలు ఉతుకుతుండగా చిన్న కూతురు పింకు ఆడుకుంటూ నీళ్లలోకి దిగింది. మునిగిపోతుండగా గమనించిన అక్క లహరి చెల్లిని కాపాడేందుకు నీళ్లలోకి దూకింది. ఇద్దరూ మునుగుతున్నట్లుగా అక్కడికి 20 అడుగుల దూరంలో బట్టలు ఉతుకుతున్న తల్లి చూసి పరుగు పరుగున అక్కడికి చేరుకుంది. కన్నబిడ్డలను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా నీళ్లలో కొట్టుకుపోయింది. సంఘటన ప్రదేశానికి కొద్ది దూరంలోనే భర్త రామారావు వ్యవసాయ పనిలో ఉన్నాడు. బట్టలు ఉతుకుతున్న భార్య, ఆమెతో వచ్చిన పిల్లలు కన్పించడం లేదన్న అనుమానంతో చెరువు వద్దకు రాగా వారు విగతజీవులుగా కనిపించారు.