ఆంధ్రప్రదేశ్‌

రాజరాజేశ్వరిగా శ్రీశైల భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 10: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం శ్రీభ్రమరాంబదేవి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమల్లికార్జున స్వామి, అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చనలు, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగం, పారాయణాలను అర్చక వేదపండితులు శాస్త్రానుసారంగా నిర్వహించారు. కుమారిపూజ, మధ్యాహ్న కాలార్చన, సహస్ర నామార్చన, సాయంకాలం జపాలు, అనుష్టానాలు, కుంకుమార్చన, చండీహోమం, రుద్రహోమం, సుహాసిని పూజ, కాళరాత్రి పూజలు జరిపారు. శ్రీరాజరాజేశ్వరిదేవిని ఉపాసించడం వల్ల అధికారం సిద్ధిస్తుందని, చేసే పనుల్లో సామర్థ్యం వృద్ధి చెందుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఉత్సవమూర్తులను సాయంత్రం అక్కమహాదేవి మండలంలో అందంగా అలంకరించిన అశ్వవాహనంపై ఆశీనులను చేశారు.