తెలంగాణ

కెసిఆర్‌పై ఆదివాసీల దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 10: 3జిల్లాల పునర్విభజనతో ఆదివాసీ ప్రాంతాలను ముక్కలు చెక్కలు చేస్తుంటే తమ జాతి ఉనికిని కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యేలు ఎందుకు వౌనంగా ఉన్నారు? పునర్విభజనపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అసలు గవర్నర్ పాలనలో ఉండాల్సిన ఆదివాసీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కర్రపెత్తనం ఏంటి? నూతన జిల్లాల ఆవిర్భావం ఆదివాసీలకు బ్లాక్‌డే, కెసిఆర్ పాలనపై 100 రోజుల దండయాత్ర చేస్తున్నాం2 అని ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు సోంది వీరయ్య తెలంగాణ సర్కారుపై నిప్పులు చెరిగారు. వాజేడు నుంచి భద్రాచలం వరకు జిల్లాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఐదు రోజుల పాదయాత్ర సోమవారం భద్రాచలంలో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలపై గవర్నర్ కలెక్టర్ల ద్వారా పరిపాలన సాగించాలన్నారు. కానీ దొడ్డిదారిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కర్రపెత్తనం చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ మండలాలను ముక్కలు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఏ రాజ్యాంగం కల్పించిందో వివరించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం మన్యం నుంచి వాజేడు, వెంకటాపురం మండలాలను, ఇల్లెందు నియోజకవర్గం నుంచి బయ్యారం, గార్లను అడ్డగోలుగా చీల్చితే ఆదివాసీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, సున్నం రాజయ్య ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. కొత్త జిల్లాల ప్రారంభ దినోత్సవాన్ని ఆదివాసీలు బ్లాక్‌డేగా పాటించి నిరసన తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని అదిలాబాద్ మొదలు శ్రీకాకుళం వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని, అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీలను వంచించిన కెసిఆర్ పాలనపై 100 రోజుల దండయాత్రలో భాగంగా చైతన్యరథంపై ప్రతీ గూడెం తిరిగి ఆదివాసీలను చైతన్యపరుస్తామన్నారు. ప్రభుత్వ బానిస రాజకీయ వ్యవస్థను వివరిస్తూ ఎమ్మెల్యేలను గూడేల్లోకి రాకుండా అడ్డుకుంటామని వెల్లడించారు. ఆదివాసీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి కలిసి రావాలని, ఆదివాసీ జాతికి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ముందుగా పాదయాత్ర ద్వారా భద్రాచలం పట్టణంలోకి ప్రవేశించిన సోంది వీరయ్యకు మద్దతుగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి, కెచ్చెల కల్పన, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు వట్టం నారాయణ, ఏజెన్సీ దళిత సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్యలు ర్యాలీలో పాల్గొన్నారు.