తెలంగాణ

ప్రారంభోత్సవాలకు మంత్రులు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: దసరా పర్వదినాన మంగళవారం నుంచి 21 కొత్త జిల్లాలను ప్రారంభించే బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల జాబితాను అనధికారికంగా రెండు రోజుల కిందట ప్రకటించినప్పటికీ దానిలో పలుమార్పులు చేసి తాజాగా సోమవారం తిరిగి విడుదల చేసింది. ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ప్రణాళిక సంఘం వైస్-చైర్మన్ నాలుగు జిల్లాలను ప్రారంభించనుండగా మిగతా జిల్లాలను మంత్రులు ప్రారంభిస్తారు. సిఎం కెసిఆర్ స్వయంగా సిద్ధిపేట జిల్లాను ప్రారంభించనుండగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.