తెలంగాణ

కొలువుదీరిన కొత్త కలెక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ సోమవారం పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం జారీ చేసింది. పది జిల్లాలతో ఉన్న తెలంగాణను 31 జిల్లాలతో పునర్వ్యవస్థీకరించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా 25 రెవిన్యూ డివిజన్లు, 125 మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇలావుండగా రాష్ట్రంలో మనుగడలోకి రానున్న 31 జిల్లాలకూ (10 జిల్లాలు పాతవి) కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను మాత్రం యధావిధిగా కొనసాగించింది. కొత్తగా నియమితులైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం సమావేశమయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాతనే కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమించాల్సి ఉన్నప్పటికీ ముందస్తుగా వౌఖిక సమాచారం ఇచ్చి పిలిపించి వారితో రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం నుంచి అధికారికంగా తొలి రోజు చేపట్టాల్సిన విధులపై రాజీవ్ శర్మ వారికి మార్గదర్శనం చేశారు. మరో వైపు కొత్తగా ఏర్పాటు చేసిన 5 పోలీస్ కమిషనరేట్లతో పాటు 21 కొత్త జిల్లాలకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లను (ఎస్పీ) కూడా నియమించింది.
31 జిల్లాలకు కలెక్టర్లు, జెసిలు వీరే
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా బుద్ధప్రకాశ్, మంచిర్యాలకు ఆర్‌వి కర్నన్, నిర్మల్‌కు ఇంబర్తి, కొమురం భీమ్ జిల్లాకు చంపాలాల్ నియమితులయ్యారు. నిజామాబాద్ కలెక్టర్‌గా యోగితా రాణా, కామారెడ్డికి ఎన్ సత్యనారాయణ, కరీంనగర్‌కు సర్పరాజ్ అహ్మద్, పెద్దపల్లికి అలుగు వర్షిణి, జగిత్యాలకు ఎ శరత్, రాజన్న సిరిసిల్లకు కె కృష్ణ్భాస్కర్ నియమితులయ్యారు. వరంగల్ అర్బన్‌కు అమ్రాపాలి కట్టా, వరంగల్ రూరల్‌కు పాటిల్ ప్రశాంత్ జీవన్, మహబూబాబాద్‌కు ప్రీతిమీనా, జయశంకర్ భూపాల్‌పల్లికి ఎ మురళి, జనగామకు దేవసేన, ఖమ్మంకు లోకేశ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు రాజీవ్ జి హన్మంతు, నల్లగొండకు గౌరవ్ ఉప్పల్ నియమితులయ్యారు. సూర్యపేటకు సురేంద్ర మోహన్, యాదాద్రికి అనితా రామచంద్రన్, మెదక్‌కు భారతీ హుర్కేరి, సంగారెడ్డికి కె మాణిక్ రాజ్, సిద్దిపేటకు వెంకటరామారెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డికి పాత కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు కొనసాగుతారు. మేడ్చల్‌కు ఎంవి రెడ్డి, వికారాబాద్‌కు బి దివ్య, మహబూబ్‌నగర్‌కు రోనాల్డ్ రోస్, వనపర్తికి శే్వత మహంతి, నాగర్ కర్నూల్‌కు ఇ శ్రీ్ధర్, జోగులాంబ గద్వాలకు రజత్ కుమార్ సైనీలను కలెక్టర్లుగా నియమించారు.
పోలీస్ కమిషనర్లు వీరే..
కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా కమలహాసన్ రెడ్డి, ఖమ్మంకు షానవాజ్ ఖాసీం, రామగుండంకు విక్రం జిత్ దుగ్గల్, సిద్దిపేటకు శివకుమార్, నిజామాబాద్‌కు కార్తికేయ నియమితులయ్యారు. ఇక ఎస్పీలుగా సూర్యాపేటకు పరిమళ, నిర్మల్‌కు విష్ణువారియత్ అసిఫాబాద్‌కు సన్‌ప్రీత్ సింగ్, జగిత్యాలకు అనంతశర్మ, రాజన్న సిరిసిల్లకు విశ్వజిత్, జయశంకర్ భూపాలపల్లికి భాస్కర్, వనపర్తికి రోహిణి, గద్వాలకు విజయకుమార్, అదిలాబాద్‌కు శ్రీనివాస్, మెదక్‌కు చందనాదీప్తి, కొత్తగూడెంకు అంబర్ కిశోర్ ఝాలు నియమితులయ్యారు.