తెలంగాణ

దసరానే మన పెద్ద పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగ దసరా పండుగ రోజుననే అతి పెద్ద పరిపాలనా సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టడం శుభప్రదం అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సారి మంచి వర్షాలు కురవడంతో మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువులు నిండాయని, నీటి అలలపై బతుకమ్మలు నాట్యమాడిన అద్భుత సన్నివేశం తెలంగాణ అంతటా కనిపించిందన్నారు. అదే స్ఫూర్తి ఉత్సాహంతో దసరా పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సారి మంచి కాలం కావడంతో రైతులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. రబీ పంటల కోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం సిద్దమవుతుందన్నారు. రైతుల డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అత్యంత ఆశావహ దృక్పథం తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలలో నెలకుందని, భగవంతుడు కూడా తెలంగాణను ఆశీర్వదిస్తున్నడన్నారు. దసరా రోజుననే ఏర్పడనున్న కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని దీవించలని ముఖ్యమంత్రి అన్నారు.

చిత్రం... కొత్త జిల్లాల ఆవిర్భావ ఏర్పాట్లపై సోమవారం ఉన్నతస్థాయి యంత్రాంగంతో సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్