తెలంగాణ

రాష్ట్రానికి అశోక్ లేలాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానంలోవున్న అశోక్ లేలాండ్ కంపెనీ తెలంగాణలో భారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా వెయ్యిమందికి, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పించబోయే యూనిట్ ఏర్పాటుకు అశోక్ లేలాండ్ కంపెనీ సోమవారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. క్యాంపు కార్యాలయంలో సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో జరిగిన ఒప్పంద పత్రాలను సిఎంఓ అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అశోక్ లేలాండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరి మార్చుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఉత్పాదాక రంగాలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందన్నారు. పరిశ్రమలకు భూమి, ఇతర వౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు అన్ని రకాల అనుమతులను కేవలం 15 రోజులలో ఇచ్చేందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామన్నారు. స్థానికంగా నెలకొల్పే పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి అవసరమైన వాటిని వీటినుంచే కొనుగోలు చేస్తామన్నారు. టిఎస్‌ఆర్టీసి, జిహెచ్‌ఎంసికి అవసరమైన వాహనాలను తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల నుంచే కొనుగోలు చేయనున్నట్టు సిఎం చెప్పారు. రాష్ట్రంలో మాస్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్‌ను మెరుగుపర్చేందుకు అశోక్ లేలాండ్ కంపెనీ సహకారాన్ని తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో పట్టణ జనాభా 45శాతం ఉందని, వారికి రవాణా వ్యవస్థను మెరుగు పర్చడానికి ప్రణాళికను తయారు చేస్తున్నామన్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు లక్షల్లో ఉన్నారని, భవిష్యత్‌లో రవాణా వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పరిశ్రమల మంత్రి కె తారక రామారావు, విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు అశోక్ లేలాండ్ ప్రతినిధి బృందంతో రాష్ట్రంలో నెలకొల్పనున్న యూనిట్‌పై చర్చించారు.

చిత్రం... సిఎం కెసిఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న అధికారులు, కంపెనీ ప్రతినిధులు