తెలంగాణ

దసరా ఉత్సవాలకు ఆలయాల ముస్తాబు ఆంధ్రభూమి బ్యూరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: దసరా ఉత్సవాలకు తెలంగాణలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలను దాదాపు అన్ని ప్రధాన దేవాలయాలతో పాటు చిన్న దేవాలయాల్లో కూడా నిర్వహిస్తున్నారు. మంగళవారం దసరా (విజయదశమి) ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, పందిళ్ల ఏర్పాటు పూర్తయింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ మంగళవారం సెలవు కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రధాన దేవాలయ ప్రాంగణాల్లో జమ్మి చెట్టుకు పూజలు చేయడం, జమ్మి చెట్టు లేని చోట జమ్మి మండను ఏర్పాటు చేసి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాసర, వేములవాడ, వరంగల్ భద్రకాళి, మహంకాళి (సికింద్రాబాద్), పెద్దమ్మగుడి (హైదరాబాద్) తదితర ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర అన్ని దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకణ నవరాత్రుల ప్రారంభం నుండే జరుగుతున్నాయి.